భారతదేశం, అక్టోబర్ 19 -- తిరుపతి జిల్లా పరిధిలో కొత్తగా నిర్మించిన రహదారిని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ట్రాక్టర్‌తో తవ్వి ధ్వంసం చేయడంపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని స్పష్టం చేసిన ఆయన, బాధ్యులైన వారిపై నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కఠిన కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

తిరుపతి జిల్లా పుల్లంపేట మండల పరిధిలోని అనంతసముద్రం గ్రామం నుంచి పాపక్కగారిపల్లె వరకు వెళ్లే బీటీ రోడ్డును రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రూ. 4.75 కోట్ల వ్యయంతో పునర్నిర్మించింది.

అయితే రోడ్డు నిర్మాణం పూర్తయిన వారం రోజులకే.. వైసీపీ నాయకులు సుబ్బారెడ్డి, వ...