రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. జులై 31 నుంచి ఆన్లైన్లోనే అదనపు లగేజ్ బుకింగ్
భారతదేశం, జూలై 23 -- రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే వేగం, సౌలభ్యం దిశగా మరో తీపి కబురు అందించింది. నిర్ణీత ఉచిత పరిమితికి మించి లగేజ్ (సామాన్లు) తీసుకెళ్లే ప్రయాణికులు ఇకపై పార్సిల్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ఆన్లైన్ ద్వారానే అదనపు లగేజ్ బుకింగ్ చేసుకునే కొత్త వెసులుబాటును అందుబాటులోకి తెస్తున్నారు.
రైల్వే బోర్డు తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో జులై 31 నుంచి ఆన్లైన్ టికెట్ రిజర్వేషన్ సిస్టమ్‌లోనే ఎక్సెస్ లగేజ్ బుకింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. ప్రయాణికులు తమ రిజర్వుడు కంపార్ట్మెంట్లలోకి అనుమతించదగిన గరిష్ట పరిమితికి లోబడి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.
రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణికుల క్లాస్‌ను బట్టి ఉచిత లగేజ్ పరిమితి, గరిష్ట పరిమితి వేర్వేరుగా ఉంటాయి. ఏసీ ఫస్ట్ క్లాస్ 70 కేజీల వరకు ఉచితం. అదనపు రు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.