భారతదేశం, సెప్టెంబర్ 9 -- హైదరాబాద్‌లోని చర్లపల్లి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ మధ్య ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ అందించింది. నార్త్ సెంట్రల్ రైల్వే పరిధిలోని 'విజిఎల్ ఝాన్సీ' (VGL Jhansi) రైల్వే స్టేషన్‌లో నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఫలితంగా ఆ మార్గంలో నడిచే చర్లపల్లి - గోరఖ్‌పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మళ్లించినున్నారు.

నవంబర్, డిసెంబర్ నెలల్లో వేర్వేరు తేదీల్లో బయలుదేరే ఈ సర్వీసులు ప్రత్యామ్నాయ మార్గాల్లో నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో స్పష్టం చేసింది.

ఈ రెండు మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికులు మళ్లించిన రూట్ల సమాచారాన్ని, రైళ్ల రాకపోకల సమయాలను గమనించి తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. రైలు వేళలు, ఆగు స్టేషన్ల పూర్తి వి...