భారతదేశం, జూన్ 12 -- తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు, తిరుపతికి వచ్చే ప్యాసెంజర్లకు దక్షిణ రైల్వే కీలక అలర్ట్ జారీ చేసింది. తమిళనాడులోని అరక్కోణం రైల్వే యార్డ్‌లో మౌలిక వసతుల మెరుగుదల, విస్తరణ పనులు చేపట్టడం వల్ల ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. జూన్ 26, 28 తేదీల్లో చెన్నై సెంట్రల్ - తిరుపతి మార్గంతో పాటు మొత్తం 8 రైళ్ల సర్వీసులపై ఈ ప్రభావం పడనుంది. ప్రయాణికులు గమనించాల్సిన రద్దు చేసిన ప్రధాన రైళ్ల సమయాలు, తాజా రైల్వే అప్‌డేట్స్ ఇక్కడ ఉన్నాయి.

చెన్నై సెంట్రల్ నుండి తిరుపతి వెళ్లే ఉదయం 6:30 గంటల సర్వీస్, అలాగే మధ్యాహ్నం 2:24 గంటల సప్తగిరి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఈ నెల 26, 28 తేదీల్లో పూర్తిగా రద్దు చేశారు.

చెన్నై సెంట్రల్ నుండి తిరుపతి వైపు సాయంత్రం 4:35 గంటలకు బయలుదేరే ర...