భారతదేశం, జూలై 3 -- తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు సౌత్ కోస్ట్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ (చర్లపల్లి మీదుగా) నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సర్వీసుల కాలపరిమితిని మరింత కాలం పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

తాజా పొడిగింపు షెడ్యూల్ ప్రకారం... ఈ ప్రత్యేక రైళ్లు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నిర్ణీత తేదీలలో ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. ఈ రైళ్ల సమయాలు , ఆగే స్టేషన్లు, కోచ్‌ల సంఖ్య నిర్వహణ విధానంలో ఎలాంటి మార్పులు ఉండవు. పాత షెడ్యూల్ ప్రకారమే ఇవి నడుస్తాయి.

ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం 5 ఏసీ టూ-టైర్ కోచ్‌లు (AC 2-Tier), 4 ఏసీ త్రీ-టైర్ కోచ్‌లు (AC 3-Tier), 6 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 4 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. అంతేకాకుండా ఒక...