భారతదేశం, ఆగస్టు 14 -- రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 3,993 జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrb.indianrailways.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 14న ప్రారంభమై, సెప్టెంబర్ 13తో ముగుస్తుంది. దరఖాస్తు ఫీజు చెల్లించడానికి సెప్టెంబర్ 15 వరకు సమయం ఇచ్చారు. సమర్పించిన దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి (Correction Window) సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 25 వరకు అవకాశాన్ని కల్పించారు.

ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్...