భారతదేశం, సెప్టెంబర్ 5 -- దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని కాజీపేట-బల్లార్షా రైల్వే సెక్షన్ ఆధునీకరణ పనులు వేగవంతమయ్యాయి. రైళ్ల రాకపోకల్లో మరింత భద్రత, వేగం పెంచేందుకు గాను ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఈ మార్గంలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

దీనిలో భాగంగా జమ్మికుంట-పొత్కపల్లి స్టేషన్ల నడుమ సుమారు 17 కిలోమీటర్ల పరిధిలో నాన్ ఇంటర్‌లాకింగ్ సాంకేతిక పనులు చేపట్టనున్నారు. ఈ మరమ్మతులు, సాంకేతిక పనుల కారణంగా సెప్టెంబర్ 10న పలు ప్యాసింజర్, మెము, ఎక్స్‌ప్రెస్ రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయడంతో పాటు కీలక సూపర్‌ఫాస్ట్ రైళ్లను రీషెడ్యూల్ లేదా నియంత్రించనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

రైలు నం. 17003 / 17004 కాజీపేట - సిర్పూర్ టౌన్, బల్లార్షా - కాజీపేట రామగిరి మెము ఎక్స్‌ప్రెస్ రైళ్లను సర్వీ...