భారతదేశం, మార్చి 17 -- సాధారణంగా భారతీయ రైళ్లలో ప్రయాణించేటప్పుడు బాత్‌రూమ్‌ల పరిస్థితిని తలుచుకుంటేనే చాలామందికి నీరసం వస్తుంది. అపరిశుభ్రత, దుర్వాసన వంటి ఫిర్యాదులు తరచూ వినిపిస్తుంటాయి. కానీ, భారతదేశపు అత్యంత విలాసవంతమైన రైలు 'ప్యాలెస్ ఆన్ వీల్స్' (Palace on Wheels)లో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. ఇక్కడి బాత్‌రూమ్‌లను చూస్తే మీరు ఏదైనా విదేశీ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉన్నామా? అనే అనుమానం కలగక మానదు.

ప్యాలెస్ ఆన్ వీల్స్ సేల్స్ డైరెక్టర్ భవానీ సింగ్ ఫిబ్రవరి 24న ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో రైలులోని ప్రీమియం వాష్‌రూమ్ దృశ్యాలు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి. రైలులో ఇంతటి అత్యాధునిక వసతులు ఉంటాయా అని అంతా నోరెళ్లబెడుతున్నారు.

ఈ విలాసవంతమైన వాష్‌రూమ్‌లో తెల్లటి మెరిసిపోయే రెక్టాంగిల్ బాత్‌టబ్ ప్రధాన ఆకర్...