భారతదేశం, మే 27 -- అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయి ఆందోళన చెందుతున్న తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఉపశమనం కలిగించింది. కొనుగోలు కేంద్రాలకు (ఐకేపీ సెంటర్లు) రైతులు తీసుకొచ్చే తడిసిన ధాన్యాన్ని సైతం నిబంధనల ప్రకారం పూర్తిగా కొనుగోలు చేస్తామని, అన్నదాతలు ఎలాంటి అపోహలు, ఆందోళనలు పెట్టుకోవద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇప్పటికే కురిసిన అకాల వర్షాల వల్ల తడిసిన సుమారు 9,214 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అత్యంత వేగంగా సేకరించి, బాయిల్డ్ రైస్ మిల్లులకు విజయవంతంగా తరలించినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల తాజా పరిస్థితి, వర్షాల ప్రభావంపై ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రివర్గ సహచరులు క...