భారతదేశం, మే 13 -- ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం రైతులకు వెన్నుదన్నుగా నిలిచింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు గానూ 14 రకాల పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా రైతులు తమ పెట్టుబడిపై కనీసం 50 శాతం లాభం పొందేలా ధరలను ఖరారు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పంట అయిన వరి ధాన్యం మద్దతు ధరను క్వింటాల్‌కు రూ. 72 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది.

ఈసారి మద్దతు ధరల పెంపులో పొద్దుతిరుగుడు (Sunflower) పంట రికార్డు సృష్టించింది. క్వింటాల్‌కు ఏకంగా రూ. 622 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పొద్దుతిరుగుడు ధర రూ. 8,343కు చేరింది.

పత్తి రైతులకు కూడా కేంద్రం పెద్ద పీట వేసింది. మధ్యస్థ పింజ పత్తిపై రూ. 55...