భారతదేశం, నవంబర్ 11 -- రబీ సీజన్‌లో పంటలు సాగు చేసే రైతులకు ఎరువుల కొరత లేకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్ఫేట్, పొటాష్ (పీఅండ్కే) ఆధారిత ఎరువులపై అందించే సబ్సిడీ బడ్జెట్‌ను ఏకంగా 64.3 శాతం పెంచుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీని ప్రకారం రాబోయే రబీ సీజన్‌కు ఎరువుల సబ్సిడీ కోసం ప్రభుత్వం రూ.62,370 కోట్లు కేటాయించనుంది.

గత రబీ సీజన్‌లో ఎరువుల సబ్సిడీ బడ్జెట్ రూ.37,952 కోట్లుగా ఉంది. ఈ సారి దానికి అదనంగా రూ.24,418 కోట్లు జత చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువులు, వాటి తయారీకి వాడే ముడిపదార్థాల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో రైతులపై ఆ భారం పడకుండా ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది.

ఫిబ్రవరిలో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత అంతర్జాతీయ ఎరువుల మార్కెట...