భారతదేశం, అక్టోబర్ 9 -- రాష్ట్రంలోని నిరుపేద, మారుమూల గ్రామీణ ప్రాంత రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆధునిక వ్యవసాయ యాజమాన్య పద్ధతులను చేరువ చేసేందుకు వ్యవసాయ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) నుంచి కమిషనరేట్ స్థాయి అధికారుల వరకు క్షేత్రస్థాయిలో అందుతున్న సేవలకు అదనంగా.. రైతన్నలు తమ అరచేతిలోని మొబైల్ ఫోన్ ద్వారానే తక్షణ పరిష్కారాలు, సలహాలు పొందేందుకు "కిసాన్ హెల్ప్‌లైన్ సెంటర్" (KHC) అందుబాటులోకి వచ్చింది.

రైతులు తమ పొలాల్లో పంటకు ఏదైనా తెగులు సోకినా, ఎరువుల వినియోగం ఎంత మోతాదులో చేయాలో తెలియకపోయినా, పంట మార్పిడిపై సందేహాలు ఉన్నా ఈ సెంటర్ ను సంప్రదించవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక ఇబ్బంది పడుతున్నా సరే.. ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వెంటనే ఉచిత టోల్ ఫ్రీ నంబర్ 1800-180-1551 కి కాల్ చేస్తే చాలు......