భారతదేశం, అక్టోబర్ 28 -- రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరటనిచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కార్యక్రమానికి రూపకల్పన చేస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా ప్రస్తుతం అందిస్తున్న ఉచిత బియ్యంతో పాటు ప్రతి ఇంటా ప్రతినిత్యం వినియోగించే ఆరు ముఖ్యమైన నిత్యావసర సరుకులను రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయడానికి ప్రణాళికలు వేగవంతం చేసింది.

ప్రస్తుతం రేషన్ షాపుల్లో కేవలం బియ్యం మాత్రమే లభిస్తుండటంతో, వంటకు కావాల్సిన మిగిలిన సరకుల కోసం పేద ప్రజలు బహిరంగ మార్కెట్‌పై ఆధారపడి వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ భారాన్ని తగ్గించేందుకు పౌరసరఫరాల శాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనల్లోని ముఖ్య సరుకులు చూసుకుంటే.. కందిపప్పు, వంట నూనె (పామాయిల్), చింతపండు, కారంపొడి, చక...