రేపటి నుంచి దేశవ్యాప్త ఆందోళనలు: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు సీజేపీ డిమాండ్
భారతదేశం, అక్టోబర్ 1 -- ఓటర్ల జాబితాల్లో అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల సంఘంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పోరాటానికి దిగింది. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ పార్క్ గేట్ నంబర్ 6 వద్ద సాయంత్రం 4 గంటలకు తొలి నిరసన ప్రదర్శన చేపడుతున్నట్లు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ప్రకటించారు. ఈ ఆందోళనను దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించి, చివరికి దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాతో ముగిస్తామని వెల్లడించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
దేశంలో ఎన్నికల ప్రక్రియపై ప్రజలు పూర్తిగా నమ్మకం కోల్పోయారని అభిజీత్ దిప్కే విమర్శించారు. "ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం ఉందనేది కేవలం ఒక భ్రమ మాత్రమే" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 202...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.