భారతదేశం, అక్టోబర్ 11 -- కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రూ. 3,296 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రేడియల్ రోడ్-2 ప్రాజెక్టు టెండర్ ప్రక్రియలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఈ టెండర్లను తక్షణమే రద్దు చేయాలని.. కాంట్రాక్టుల కేటాయింపుపై పూర్తిస్థాయి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఓ సుదీర్ఘ బహిరంగ లేఖ రాశారు.

తక్కువ ధరకు బిడ్లు వేసిన సంస్థలను నిబంధనలకు విరుద్ధంగా సాంకేతిక కారణాలతో పక్కన పెట్టారని. ప్రభుత్వం తనకు అనుకూలమైన కంపెనీలకు అంచనా వ్యయం కంటే ఎక్కువ ధరకు కాంట్రాక్టులు కట్టబెట్టిందని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. టెండర్లకు సంబంధించిన అన్ని పత్రాలను, నిబంధనలను, ఎంపిక చేసిన ప్రక్రియను వెంటనే బయటపెట్టాలని ఆయన ...