భారతదేశం, జూన్ 21 -- India's Highest Paid Actor: ఒక సినిమాకు కోటి రూపాయల పారితోషికం అంటేనే ఒకప్పుడు యావత్ సినీ ప్రపంచం నోరెళ్లబెట్టేది. 1990వ దశకంలో మెగాస్టార్ చిరంజీవి, యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అతిలోక సుందరి శ్రీదేవి తొలిసారిగా కోటి రూపాయల మార్కును అందుకుని సంచలనం సృష్టించారు.

ఆ తర్వాత బాలీవుడ్‌లో ఖాన్‌ త్రయం (షారుఖ్, సల్మాన్, అమీర్) హవా నడిచింది. గత కొన్నేళ్లుగా పెద్ద బడ్జెట్ సినిమాల హంగామా పెరగడంతో రజనీకాంత్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి దక్షిణాది స్టార్లు ఒక్కో సినిమాకు రూ. 200 కోట్లకు పైగా వసూలు చేస్తూ బాక్సాఫీస్‌ను ఏలుతున్నారు.

అయితే ఈ రేసులో మొన్నటివరకు రూ. 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటూ అల్లు అర్జున్ టాప్ 1 స్థానంలో ఉన్నాడు. కానీ, తాజాగా బాలీవుడ్ మళ్లీ తన నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఖాన్స్ కాకుండా మరో క్రేజీ హీరో ...