భారతదేశం, జూన్ 1 -- దక్షిణ మధ్య రైల్వే, తిరుపతి రైల్వే స్టేషన్ నుండి 'తిరుపతి-రక్సౌల్ ఎక్స్‌ప్రెస్' రైలు సేవలను సోమవారం నుండి రెగ్యులర్ సర్వీసుగా ప్రారంభించింది. దీని ద్వారా బీహార్‌లోని రక్సౌల్ జంక్షన్‌కు తిరుపతి నుండి ప్రత్యక్ష రైలు కనెక్టివిటీ లభిస్తుంది. ఇప్పటివరకు ప్రత్యేక రైలుగా నడుస్తున్న ఈ రైలును.. ఇప్పుడు 17433, 17434 నంబర్లతో సాధారణ ఎక్స్‌ప్రెస్ రైలుగా ప్రవేశపెట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఈ రైలు రేణిగుంట, కడప, గుంతకల్లు, రాయచూరు, వికారాబాద్, సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, మంచిర్యాల, బిలాస్‌పూర్, రాంచీ, చిత్తరంజన్ మార్గాల గుండా ప్రయాణించి రక్సౌల్ చేరుకుంటుంది. సుమారు 2,795 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసే ఈ రైలు సేవ, తిరుపతిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్‌లోని ప్రధాన గమ్యస్థానాలతో కనెక్ట్ చేస్తుంద...