రెండు ఊపిరితిత్తులూ మార్చేశారు.. 47 ఏళ్ల వ్యక్తికి ఊపిరిపోశారు.. యశోద వైద్యుల ఘనత
భారతదేశం, ఆగస్టు 7 -- హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి వైద్యులు మరొక అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. 'యాంటీ-సింథటేజ్ సిండ్రోమ్' (Anti-synthetase Syndrome) కారణంగా ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిని, శ్వాస తీసుకోవడం కూడా భారంగా మారిన 47 ఏళ్ల పురుషుడికి రెండు ఊపిరితిత్తుల మార్పిడి చేసి ఊపిరి పోశారు. రెండేళ్లుగా నిరంతరం ఆక్సిజన్ సపోర్టుపైనే ఆధారపడిన సదరు బాధితుడు, ఈ ఆపరేషన్ తర్వాత స్వయంగా శ్వాస తీసుకుంటూ ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్లారు.
బాధితుడు 'ఫైబ్రోటిక్ ఇంటర్‌స్టీషియల్ లంగ్ డిసీజ్' (ILD) అనే తీవ్రమైన శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి వల్ల ఊపిరితిత్తుల కణజాలం గట్టిపడి (సాధారణ ಭాషలో చెప్పాలంటే ఊపిరితిత్తులపై మచ్చలు ఏర్పడి) శ్వాస తీసుకునే సామర్థ్యాన్ని శాశ్వతంగా కోల్పోతారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా వ్యాధి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.