భారతదేశం, జూలై 24 -- ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో రహదారి మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా పరిధిలోని ముదిగుబ్బ - కదిరి గ్రామాల మధ్య విస్తరించి ఉన్న ఎన్‌హెచ్‌-42 రహదారిని నాలుగు వరుసల మార్గంగా విస్తరించేందుకు రూ.679.71 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు కేంద్ర రహదారి రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేశారు.

ఈ విస్తరణ ప్రాజెక్టు ద్వారా కేవలం రహదారిని వెడల్పు చేయడమే కాకుండా, ప్రయాణికుల భద్రత, సులువుగా వాహనాలు వెళ్లేందుకు వీలుగా అత్యాధునిక నిర్మాణాలను చేపడుతున్నారు: అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే 4 వరుసల రహదారిలో ప్రధాన కారేజ్‌వే, స్థానిక గ్రామాల ప్రజలకు, నెమ్మదిగా వెళ్లే వాహనాలకు ఇబ్బంది కలగకుండా ప్ర...