రూ.200 అత్యధిక విలువ కలిగిన నోటు కానుందా? రూ.500 నోటు రద్దు చేస్తారా?
భారతదేశం, నవంబర్ 10 -- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద నోట్ల రద్దుపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో రూ. 500 నోట్లను తక్షణమే రద్దు చేయాలని, కేవలం రూ. 100, రూ. 200 నోట్లను మాత్రమే చలామణిలో ఉంచాలని ఆయన చెప్పుకొచ్చారు. డిజిటల్ కరెన్సీపై ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించిన నివేదికలో కూడా తాను ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు.
అమరావతిలో జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. నల్లధనం, అవినీతి నిర్మూలనకు పెద్ద నోట్ల రద్దు అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. 'రూ.500, రూ.1,000, రూ.2,000 నోట్లను పూర్తిగా రద్దు చేయాలి. కేవలం రూ.100, రూ.200 నోట్లను మాత్రమే మార్కెట్లో ఉంచాలి. సాంకేతికతను సరిగ్గా ఉపయోగిస్తే సంపద సృష్టి, పేదరిక నిర్మూలన సులభతరం అవుతాయి. నేను ఈ అంశంపై నిరంతరం మాట్లాడుతూనే ఉంటాను....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.