రూ.11,359 కోట్ల పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం.. 2047 నాటికి స్వర్ణ మున్సిపాలిటీలు!
భారతదేశం, సెప్టెంబర్ 22 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల రూపురేఖలను సమూలంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం భారీ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో రూ.11,359 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు మౌలిక వసతుల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. తన సొంత నియోజకవర్గమైన కుప్పంలోని కడపల్లె నుంచి ఆయన ఈ కీలక కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రాష్ట్ర మున్సిపల్ చరిత్రలోనే ఈ రోజును ఒక సువర్ణాధ్యాయంగా అభివర్ణించిన సీఎం.. పట్టణ ప్రాంతాలను రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్లుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పట్టణాభివృద్ధిపై నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోని పట్టణాల్లో తాగునీరు, డ్రైనేజీ, రోడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.