రూ.1-2 కే బర్డ్ ఫ్లూ టీకా.. దేశీయంగా తొలి వ్యాక్సిన్ ఆవిష్కరణ
భారతదేశం, నవంబర్ 20 -- భోపాల్: పౌల్ట్రీ రంగాన్ని పట్టిపీడిస్తున్న హెచ్5ఎన్1 (H5N1) బర్డ్ ఫ్లూ నివారణకు భారత్ తొలి దేశీయ టీకాను ఆవిష్కరించింది. ఒక్కో డోసు కేవలం రూ.1 నుంచి రూ.2 ధరకే లభించే ఈ వ్యాక్సిన్ను భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) పరిధిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఎన్ఐహెచ్ఎస్ఏడీ) శాస్త్రవేత్తలు రూపొందించారు. మంగళవారం భోపాల్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ టీకాను విడుదల చేశారు.
పశుసంవర్ధక, పౌల్ట్రీ రంగాలను గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన స్తంభాలుగా మంత్రి చౌహాన్ అభివర్ణించారు. వ్యవసాయంతో పాటు నిరంతర ఆదాయాన్ని అందిస్తూ పశుసంపద రైతులకు 'నడిచే ఏటీఎం'లలా పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.
"భారత జీడీపీలో పశుసంవర్ధక రంగం వాటా 14 శాత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.