భారతదేశం, జనవరి 2 -- సోషల్ మీడియాలో ఏదైనా వార్త కనిపిస్తే చాలు, అది నిజమో కాదో తెలుసుకోకుండానే వైరల్ చేయడం ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. తాజాగా రూ. 500 నోట్ల చలామణిపై కూడా ఇటువంటి ఒక తప్పుడు వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. 2026 మార్చి నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ. 500 నోట్లను ఉపసంహరించుకోబోతోందన్నది ఆ వార్త సారాంశం.
ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వ అధికారిక విభాగం 'పిఐబి ఫ్యాక్ట్ చెక్' (PIB Fact Check) స్పందించింది. "రూ. 500 నోట్లను నిలిపివేస్తున్నట్లు ఆర్బీఐ ఎక్కడా ప్రకటించలేదు. సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు, అది పూర్తిగా అవాస్తవం" అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తేల్చి చెప్పింది.
ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ. 500 నోట్లు చట్టబద్ధమైనవని, వాటిని యధావిధిగా లావాదేవీల కోసం ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ధ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.