భారతదేశం, జూలై 23 -- స్టాక్ మార్కెట్ నిస్తేజంగా ఉన్నప్పటికీ ఒక చిన్న పెన్నీ స్టాక్ ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1) లో మైండ్ బ్లోయింగ్ ప్రదర్శన కనబరచడంతో వెల్లోరా ఇంపాక్ట్ (Vellora Impact) షేర్లు జూలై 23 గురువారం ట్రేడింగ్‌లో ఏకంగా 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. రూ. 50 లోపు లభించే ఈ స్మాల్ కేప్ కంపెనీ తన అగ్రి బిజినెస్ (వ్యవసాయ విభాగం) రాబడితో మళ్లీ లాభాల బాట పట్టింది.

గత ఏడాదితో పోలిస్తే కంపెనీ తీవ్ర నష్టాల నుంచి బంపర్ లాభాల్లోకి దూసుకెళ్లింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ రూ. 7.90 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గతేడాది ఇదే సమయానికి కంపెనీ రూ. 2.11 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేయడం గమనార్హం. ఇక మార్చి 2026 త్రైమాసికంలో వచ్చిన రూ. 0.21 కోట్ల లాభంతో పోల్చినా ఇది భారీ వృద్ధి.

కంపెనీ ఆపర...