భారతదేశం, జనవరి 8 -- అమెరికా వెళ్లాలని కలలు కనే భారతీయులకు యూఎస్ రాయబార కార్యాలయం (US Embassy) గట్టి హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా పర్యాటక (B1/B2), స్టూడెంట్, వర్క్ వీసాలపై వెళ్లేవారు నిబంధనల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వీసా నిబంధనలను ఏమాత్రం అతిక్రమించినా, అనుమతించిన కాలం కంటే ఎక్కువ రోజులు అక్కడ ఉన్నా.. భవిష్యత్తులో అమెరికా రాకుండా శాశ్వత నిషేధం (Permanent Ban) విధిస్తామని స్పష్టం చేసింది.

B1/B2 వీసాపై అమెరికా వెళ్లేవారు అక్కడ ఏ పనులు చేయవచ్చు, ఏవి చేయకూడదనే అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఎంబసీ పేర్కొంది. సోషల్ మీడియా వేదికగా ఒక యానిమేటెడ్ వీడియోను విడుదల చేస్తూ కొన్ని కీలక విషయాలను వెల్లడించింది:

వీసా ఇంటర్వ్యూ సమయంలో మీరు నిబంధనలను అతిక్రమిస్తారని లేదా వీసాను దుర్వినియోగం చేస్తారని కాన్సులర్ ఆఫీసర్‌కు అనుమాన...