భారతదేశం, ఆగస్టు 10 -- లోన్ ఈఎంఐలు కట్టడంలో కాస్త ఆలస్యమైతే చాలు.. రికవరీ ఏజెంట్ల నుంచి ఎదురయ్యే వేధింపులు, బెదిరింపులకు ఆర్‌బీఐ చరమగీతం పాడింది. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFCs), రికవరీ ఏజెంట్ల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ కేంద్ర రిజర్వ్ బ్యాంక్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. 'కండక్ట్ ఆఫ్ రెగ్యులేటెడ్ ఎన్‌టిటీస్ ఇన్ రికవరీ ఆఫ్ లోన్స్ అండ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ రికవరీ ఏజెంట్స్' పేరిట ఆగస్టు 6న ఈ నిబంధనలను జారీ చేశారు. ఇవి 2027 జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నాయి.

పెండింగ్ ఈఎంఐలు వసూలు చేసేందుకు లోన్ తీసుకున్న వ్యక్తికి చెందిన మొబైల్ ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్ వంటి డివైజ్‌లను బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రిమోట్‌గా లాక్ చేయడాన్ని ఆర్‌బీఐ పూర్తిగా నిషేధించింది. పర్సనల్ లోన్, హో...