భారతదేశం, అక్టోబర్ 30 -- దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) జులై-సెప్టెంబరు (క్యూ2) త్రైమాసికంలో మార్కెట్ అంచనాలను తలకిందులు చేస్తూ భారీ లాభాలను నమోదు చేసింది. అంతర్జాతీయంగా శుద్ధి సామర్థ్యం తగ్గి, రిఫైనింగ్ మార్జిన్లు ఊపందుకోవడమే ఇందుకు ప్రధాన కారణమైంది.

సమీక్షా త్రైమాసికంలో రిలయన్స్ నికర లాభం ఏకంగా 40 శాతం పెరిగి రూ. 25,548 కోట్లకు చేరుకుంది. మార్కెట్ విశ్లేషకులు బ్లూమ్‌బర్గ్ సర్వే ఆధారంగా రూ. 21,368 కోట్ల లాభం రావచ్చునని అంచనా వేయగా, కంపెనీ అంతకంటే దాదాపు 20 శాతం అదనపు లాభాన్ని ఆర్జించింది.

ఇక సమీకృత రాబడి (Consolidated Revenue) గత ఏడాదితో పోలిస్తే పావు శాతానికి పైగా పెరిగి రూ. 3.3 లక్షల కోట్లకు (రూ. 3.3 ట్రిలియన్లు) చేరింది. విశ్లేషకులు ఈ రాబడిని రూ. 3.1 లక్షల కోట్లుగా అంచనా వేశారు.

పశ్చిమాసియా, ఉక్రెయిన్ యు...