భారతదేశం, ఆగస్టు 13 -- కస్టమర్లకు సరికొత్త షాపింగ్ అనుభూతిని అందించేందుకు రిలయన్స్ డిజిటల్ మరో భారీ సేల్‌ను ప్రారంభించింది. తన ప్రసిద్ధ 'డిజిటల్ ఇండియా సేల్'ను నయా రూపంలో 'డిస్కో' (D.I.S.C.O. - Digital India Sale Crazy Offers) పేరిట ప్రవేశపెట్టింది.

ఈ డిస్కౌంట్ వర్షం ఆగస్టు 16 వరకు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న రిలయన్స్ డిజిటల్ స్టోర్లు, మై జియో స్టోర్లతో పాటు అధీకృత వెబ్‌సైట్ RelianceDigital.in ద్వారా కస్టమర్లు ఈ ఆఫర్లను పొందవచ్చు.

ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోలుపై పాత వస్తువులను మార్చుకునే వారికి మెరుగైన ఎక్స్ఛేంజ్ విలువ లభిస్తోంది. ఎంపిక చేసిన ఉత్పత్తులపై గరిష్ఠంగా Rs.15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఇస్తున్నారు. రెండో వస్తువు కొనుగోలుపై ఏకంగా 50 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు.

వివిధ బ్యాంక్ కార్డులు, పేపర్ ఫైనాన్స్, యూపీఐ (UPI) చెల్ల...