భారతదేశం, ఆగస్టు 17 -- కష్టపడి, సర్వీసు ముగించుకుని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాల్సిన ఆ అధికారికి రిటైర్మెంట్‌కు ముందే నూరేళ్లు నిండాయి. ఏళ్ల తరబడి కలిసి ఉన్న భార్యే, ఆస్తులు, ఆర్థిక వివాదాల నేపథ్యంలో కాలయముడిగా మారింది. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని హనుమాన్ నగర్‌కు చెందిన వెంకటేశం కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌గా ఆసిఫాబాద్‌లో విధులను నిర్వర్తిస్తున్నారు. ఆయన ఈ నెలలోనే ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేయాల్సి ఉంది. కాగా ఆయన మొదటి భార్య రాజమణి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎన్ఎమ్‌గా పనిచేస్తోంది. వెంకటేశానికి ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్య రాజమణితో గత కొంతకాలంగా ఆస్తులు, ఆర్థిక వ్యవహారాలపై వివాదాలు నడుస్తున్నాయి.

త్వరలోనే వెంకటేశం పదవీ విరమణ చేయనుండటంత...