భారతదేశం, జూలై 25 -- జ్యోతిష్యశాస్త్రంలో నీడ గ్రహాలుగా భావించే రాహువు, కేతువుల సంచారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ గ్రహాలు తమ రాశిని లేదా నక్షత్రాన్ని మార్చిన ప్రతిసారీ ద్వాదశ రాశులపై తీవ్రమైన ప్రభావం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే 2026 ఆగస్టు 2వ తేదీన రాహు, కేతువులు తమ నక్షత్రాలను మార్చుకోనున్నారు. రాహువు శతాభిష నక్షత్రం నుంచి నిష్క్రమించి ధనిష్ఠ నక్షత్రంలోకి ప్రవేశిస్తుండగా, కేతువు మాఘ నక్షత్రాన్ని వీడి ఆశ్లేష నక్షత్రంలోకి అడుగుపెడుతున్నాడు.

ప్రముఖ జ్యోతిష నిపుణులు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ విశ్లేషణ ప్రకారం.. ఈ నక్షత్ర మార్పు ముఖ్యంగా కర్కాటక, మకర రాశుల వారిపై అత్యధిక ప్రభావం చూపుతుంది. వీటితో పాటు మిథున, ధనుస్సు, మీన రాశుల వారు కూడా రాబోయే రోజుల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఆయా రాశుల వారిపై పడే ప్రభావాలు ఇక్కడ చూడండ...