భారతదేశం, జూలై 14 -- తెలంగాణ విశాల ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా ప‌ని చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులకు సూచించారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజ‌కీయాల‌కు అతీతంగా క‌లిసి ముందుకు సాగుదామ‌ని పిలుపునిచ్చారు.

నీటి పారుద‌ల ప్రాజెక్టులు, మౌలిక వ‌స‌తుల అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం నుంచి అవ‌స‌ర‌మైన అనుమ‌తుల సాధ‌న‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని ముఖ్యమంత్రి కోరారు. ఈ నెల 20 నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభమవుతున్న నేప‌థ్యంలో కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాల‌పై మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌ను ఇచ్చారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులతో పాటు ఎంపీలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ జ‌నాభాలో 10 శాతం జ‌నాభా ఆరు మ‌హా నగ‌రాల్లో హైదరాబ...