భారతదేశం, జూలై 15 -- రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ప్రియులకు, ముఖ్యంగా మోటార్ సైకిల్ కలెక్టర్లకు కంపెనీ అదిరిపోయే వార్త చెప్పింది. తన మోడళ్లలో అత్యంత అరుదైన, పరిమిత సంఖ్యలో లభించే 'షాట్‌గన్ 650 x రఫ్ క్రాఫ్ట్స్' (Shotgun 650 x Rough Crafts) ఎడిషన్ రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. తైవాన్‌కు చెందిన ప్రసిద్ధ కస్టమ్ వర్క్‌షాప్ 'రఫ్ క్రాఫ్ట్స్' భాగస్వామ్యంతో ఈ బైక్‌ను సరికొత్త హంగులతో క్లాసిక్ లుక్‌లో తీర్చిదిద్దారు.

ఈ సరికొత్త మోడల్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ సాధారణ బైక్‌లలా భారీ సంఖ్యలో విక్రయించడం లేదు. కేవలం బైక్ కలెక్టర్లను లక్ష్యంగా చేసుకుని పరిమిత సంఖ్యలోనే ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 100 యూనిట్లను మాత్రమే తయారు చేస్తుండగా.. భారత్, ఐరోపా, అమెరికా, ఏషియా పసిఫిక్ (APAC) ప్రాంతాలకు తలో 25 బైక్‌ల చొప్పున కేటాయించారు. అంటే మన దేశంలో కేవలం ...