భారతదేశం, ఆగస్టు 29 -- రాజధాని హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచే ఐటీ కారిడార్ భూముల ధరల్లో మరొక చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. రాయదుర్గం వ్యాపార ప్రాంగణంలో భూముల విలువ కొత్త రికార్డులను తిరగరాస్తోంది. ఇటీవల జరిగిన ఈ వేలంలో ఎకరం ధర ఏకంగా రూ.269 కోట్లు పలకడం స్థానికంగా, జాతీయ స్థాయి రియల్టీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) రాయదుర్గం సర్వే నంబరు 83/1 పరిధిలో ఉన్న 5.38 ఎకరాల విలువైన స్థలానికి బహిరంగ ఆన్‌లైన్ వేలం నిర్వహించింది. అధికారులు ఎకరానికి కనీస మద్దతు ధరను రూ.175 కోట్లుగా నిర్ణయించారు. ఈ వేలంలో పాల్గొనేందుకు సుమారు రూ.10 కోట్ల ముందస్తు రుసుము చెల్లించిన ప్రధాన సంస్థలకు మాత్రమే ప్రవేశం కల్పించారు.

దేశంలోనే అగ్రగామి నిర్మాణ రంగ సంస్థలు హోరాహోరీగా పోటీపడ...