భారతదేశం, జనవరి 5 -- మన దేశీ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, ఒక జపాన్ చెఫ్ మన బిర్యానీ రుచికి ముగ్ధుడై, దాని తయారీలో ప్రావీణ్యం సంపాదించి, ఏకంగా మన 'మెగా పవర్ స్టార్' రామ్ చరణ్ ఇంట్లోనే వంట చేస్తే.. ఆ మజానే వేరు.
జపాన్లోని టోక్యోకు చెందిన ప్రముఖ చెఫ్ తకమాసా ఒసావా తాజాగా హైదరాబాద్లోని రామ్ చరణ్ నివాసానికి వచ్చి మెగా కుటుంబానికి బిర్యానీ విందు ఇచ్చారు. రామ్ చరణ్ జూబ్లీహిల్స్ నివాసంలో జరిగిన ఈ ప్రత్యేక విందులో చెర్రీతోపాటు ఉపాసనకు ఈ స్పెషల్ బిర్యానీ వండాడు చెఫ్ తకమాసా ఒసావా. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఒసావా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.
"ఈ రోజు ఒక ప్రైవేట్ నివాసంలో బిర్యానీ వండాను. నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. అసలైన బిర్యానీ అంటే ఏంటో ఈ నగరం నాకు నేర్పిస్తూనే ఉంది" అని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.