భారతదేశం, డిసెంబర్ 6 -- తమిళనాడులో ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రామేశ్వరంలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. రోడ్డు పక్కన కారు ఆపి నిద్రిస్తుండగా లారీ వచ్చి ఢీ కొట్టింది.
రోడ్డు పక్కన కారు ఆగి ఉందని, లారీ ఢీకొన్న సమయంలో అందులో ఉన్న వారందరూ నిద్రలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా, మరొకరికి గాయాలయ్యాయి. చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
బాధితులు శబరిమల యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్నారు. మృతుల్లో ముగ్గురు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కొరాపు కొత్తవలస గ్రామానికి చెందినవారు కాగా, నాలుగో వ్యక్తి గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.