రాబోయే 3 గంటల్లో వర్షాలు... నెల్లూరుకు ఆరెంజ్ అలెర్ట్, ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్
భారతదేశం, అక్టోబర్ 3 -- ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు గంటల వ్యవధిలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ప్రభావిత జిల్లాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు మరియు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. దీంతో ఈ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటిస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ముఖ్యంగా జిల్లాలోని ఆత్మకూరు, సంగం, చేజర్ల, పల్లకొండ, పొదలకూరు, నెల్లూరు నగరం, రాపూరు, కొవ్వూరు పరిసర ప్రాంతాలలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.వాతావరణం ఒక్క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.