భారతదేశం, అక్టోబర్ 3 -- ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు గంటల వ్యవధిలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ప్రభావిత జిల్లాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు మరియు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. దీంతో ఈ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటిస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ముఖ్యంగా జిల్లాలోని ఆత్మకూరు, సంగం, చేజర్ల, పల్లకొండ, పొదలకూరు, నెల్లూరు నగరం, రాపూరు, కొవ్వూరు పరిసర ప్రాంతాలలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.వాతావరణం ఒక్క...