రాప్తాడు హైస్కూల్ ఘటన : నిందితుడు అరెస్ట్ - రంగంలోకి ఫోరెన్సిక్ టీమ్! అసలేం జరిగింది..?
భారతదేశం, అక్టోబర్ 31 -- అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని గోపికపై ఎలక్ట్రిక్ రంపంతో విచక్షణారహితంగా దాడి చేసిన ఉన్మాది హేమంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధర్మవరం రైల్వే స్టేషన్‌లో పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు పట్టుకుని విచారణకు తరలించారు.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం... నిందితుడు హేమంత్ బాధితురాలైన బాలికకు బంధువవుతాడని భావిస్తున్నారు. ధర్మవరం మండలం నాగలూరు గ్రామానికి చెందిన హేమంత్ తల్లిదండ్రులు చనిపోవడంతో, కొన్నాళ్లుగా అయ్యవారిపల్లెలో తన అక్క వద్ద నివాసం ఉంటున్నాడు. గత కొద్దిరోజులుగా ప్రేమ పేరుతో బాలికను వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. బాలిక తన ప్రేమను తిరస్కరించడంతో తీవ్ర కక్ష పెంచుకున్న హేమంత్.. ఉన్మాదిలా మారి విద్యుత్ రంపంతో పాఠశాల గదిలోనే ఈ దారుణ ఘాతుకానికి పాల్పడ్డి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.