భారతదేశం, నవంబర్ 2 -- అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాల తరగతి గదిలో రంపంతో భయంకరమైన దాడికి గురై తీవ్రంగా గాయపడిన పదో తరగతి విద్యార్థిని గోపిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కీలక అప్‌డేట్ ఇచ్చారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలిక క్రమంగా కోలుకుంటోందని.. ఆమె ఆరోగ్యంలో స్థిరమైన పురోగతి కనిపించిందని వైద్యుల బృందం స్పష్టం చేసింది.

ఇందుకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఆ బాలిక పూర్తిగా స్పృహలోకి వచ్చిందని, ఆమె తల్లిని కూడా కలవడానికి ఆస్పత్రి వర్గాలు అనుమతించినట్లు పేర్కొన్నారు. బాలిక స్వయంగా ఊపిరి తీసుకోగలిగేలా ఆరోగ్యం మెరుగుపడటంతో.. సోమవారం సాయంత్రానికి వెంటిలేటర్ సపోర్ట్‌ను తొలగించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. బాలిక త్వరగా పూర్తి కోలుకోవ...