భారతదేశం, నవంబర్ 2 -- అనంతపురం జిల్లా రాప్తాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని గోపికపై రంపంతో ఘాతాతుకానికి పాల్పడిన ఉన్మాది హేమంత్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం తీవ్ర విషమంగా మారింది. పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిందితుడికి అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రస్తుతం అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

నిందితుడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి మీడియాతో మాట్లాడుతూ కీలక వివరాలను వెల్లడించారు. ఆదివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో పోలీసులు గాయపడిన హేమంత్‌ను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

నిందితుడి కాళ్లకు తీసిన ఎక్స్-రే నివేదికల్లో బుల్లెట్లు ఏవీ లోపల లేవని తేలింది. బుల్లెట్లు కాలు గుండా దూసుకెళ్లినట్లు వైద్యులు గుర్తించారు. హేమంత్ కుడి కాలుకు తీవ్రమైన గా...