భారతదేశం, అక్టోబర్ 31 -- అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దారుణ దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి గురైన విద్యార్థినితో పాటు ఆమె తల్లితో సీఎం ఫోన్‌లో స్వయంగా మాట్లాడి ధైర్యం చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, నిందితుడిని తక్షణమే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.

పాఠశాల గదిలోనే విద్యార్థినిపై జరిగిన అమానుష దాడిని సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఫోన్ సంభాషణ సమయంలో విద్యార్థిని, ఆమె తల్లికి ధైర్యం చెప్పిన సీఎం, "ఎలాంటి భయాందోళన చెందవద్దు.. ధైర్యంగా ఉండండి. ప్రభుత్వం మీకు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుంది" అని అభయమిచ్చారు. నిందితుడిని పట్...