భారతదేశం, నవంబర్ 7 -- మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ డ్రామా చిత్రం 'కాంత'. దుల్కర్ సల్మాన్‌తోపాటు రానా దగ్గుబాటి, సముద్ర ఖని, భాగ్యశ్రీ బోర్సే, రవీంద్ర విజయ్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు.

నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్‌గా కాంత మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నవంబర్ 6న కాంత మూవీ ట్రైలర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కాంత ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దుల్కర్ సల్మాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

కాంత ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. కాంత ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాని కచ్చితంగా థియేటర్స్‌లో చూడండి. ఎందుకంటే ఇది గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే సినిమా" అని ...