భారతదేశం, మే 3 -- మనం రోజంతా కష్టపడి పనిచేసేది సుఖంగా ఉండటానికే. అయితే కొన్నిసార్లు ఎంత కష్టపడినా ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో కలహాలు లేదా మనశ్శాంతి కరువవ్వడం వంటివి జరుగుతుంటాయి. దీనికి కారణం మనకు తెలియకుండానే రాత్రి వేళల్లో మనం చేసే కొన్ని వాస్తు విరుద్ధమైన పనులు కూడా కావచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం, రాత్రి సమయం అనేది విశ్రాంతికి మాత్రమే కాదు, ఇంట్లోని శక్తిని సమతుల్యం చేసే సమయం కూడా. లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు రాత్రిపూట చేయకూడని పనులేంటో ఇప్పుడు చూద్దాం..

చాలామంది రాత్రి భోజనం చేసిన తర్వాత గిన్నెలను అలాగే వదిలేసి, మరుసటి రోజు ఉదయం శుభ్రం చేస్తుంటారు. వాస్తు ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు. అపరిశుభ్రమైన వంటగది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. ఎంగిలి పాత్రలను రాత్రంతా అలాగే ఉంచడం వల్ల అన్నపూర్ణా దేవికి కోపం వస్తుందని అంటారు. ఇది ఆర్థిక నష...