రాత్రికి కళింగపట్నం వద్ద తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాలు!
భారతదేశం, సెప్టెంబర్ 23 -- బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య తీరం దాటే అవకాశం ఉందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తీరం దాటే సమయంలో సముద్రం తీవ్ర అలజడిగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో తీరం వెంట గంటకు 50 నుండి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
ఈదురుగాలులతో పాటుగా కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలలో హఠాత్తుగా వరదలు వచ్చే అవకాశముందని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు, పునరావాస కేంద్రాలకు మారాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.
గడిచిన 6 గంటల్లో 13 కిలో మీటర్ల వేగంతో కదిలిన తీవ్రవాయుగుండం.. ప్రస్తుతానికి కళింగపట్నానికి 30 కి.మీ దూరంలో ఉంది. విశాఖపట్నానికి 90 కి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.