భారతదేశం, జూలై 24 -- జాతీయ గేయం 'వందేమాతరం'కు జాతీయ గీతంతో సమానంగా చట్టభద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో 'ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ (అమెండ్‌మెంట్) బిల్లు, 2026'ను ప్రవేశపెట్టింది. నీట్-యుజి (NEET-UG) పేపర్ లీకేజీ వివాదంపై విపక్ష ఎంపీలు తీవ్రస్థాయిలో నినాదాలు చేస్తున్నప్పటికీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తరఫున హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ ప్రతిపాదనను సభ ముందుకు తెచ్చారు.

ఈ నూతన ప్రతిపాదిత బిల్లు 1971 నాటి 'ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్'ను సవరిస్తుంది.

ప్రస్తుతం జాతీయ పతాకం, రాజ్యాంగం, జాతీయ గీతాన్ని (జనగణమన) అవమానించడం నేరం. ఈ నేరానికి గరిష్ఠంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే నిబంధన ఉంది.

సవరణ బిల్లు ప్రకారం, ఇకపై జాతీయ గేయం 'వందేమాతరం' అలపనకు ఆటంకం కలిగించినా లేదా దానికి అవమ...