భారతదేశం, ఏప్రిల్ 27 -- రాజ్యసభ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత రాఘవ్ చడ్డాతో పాటు మరో ఆరుగురు ఎంపీలు బీజేపీలో విలీనం కావడానికి రాజ్యసభ ఛైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ పచ్చజెండా ఊపారు. గత వారమే ఆప్ నుంచి బయటకు వచ్చిన ఈ రెబల్ ఎంపీలు, ఇప్పుడు అధికారికంగా కమలం గూటికి చేరారు. దీంతో 245 మంది సభ్యులున్న రాజ్యసభలో బీజేపీ బలం 113కి పెరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి కీలక బిల్లుల ఆమోదం సమయంలో పెద్ద ఊరటనిచ్చే అంశం.

బీజేపీలోకి వెళ్లిన వారిలో రాఘవ్ చడ్డా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్, విక్రమ్‌జిత్ సింగ్ సహానీ, హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేందర్ గుప్త ఉన్నారు. ఈ ఏడుగురు సభ్యుల పేర్లు ఇప్పుడు రాజ్యసభ అధికారిక జాబితాలో బీజేపీ ఎంపీలుగా నమోదయ్యాయి. ఈ పరిణామంతో ఎగువ సభలో ఆప్ బలం కేవలం మూడుకు పడిపోయింది. పంజాబ...