భారతదేశం, అక్టోబర్ 24 -- కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో అధికారికంగా అడుగుపెట్టారు. తన తొలి పోస్ట్‌లోనే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో ఉన్న మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్ నగరంలో ఒక చిన్న గ్రీక్ రెస్టారెంట్‌లో తమ మధ్య మొదలైన ప్రేమ ప్రయాణాన్ని వివరిస్తూ భావోద్వేగ వీడియోను పంచుకున్నారు.

రాజీవ్ గాంధీతో తన తొలి భేటీ గురించి సోనియా గాంధీ సుదీర్ఘంగా మాట్లాడారు. ఆ రోజుల్లో ఇంగ్లాండ్‌లో లభించే ఆహారం తనకు అస్సలు నచ్చేది కాదని, సొంత ఊరి రుచులకు దగ్గరగా ఉండే తిండి కోసం వెతుకుతుండగా కేంబ్రిడ్జ్‌లోని 'వార్సిటీ రెస్టారెంట్' అనే గ్రీక్ హోటల్ కనిపించిందని ఆమె తెలిపారు. ఆ రెస్టారెంట్‌కు యూరోపియన్, భారతీయ విద్యార్థులు ఎక్కువగా వచ్చేవారని పేర్కొన్నారు.

"ఆ చిన్న గ్రీక్ రెస్టారెంట్‌లోనే నేన...