భారతదేశం, మే 28 -- ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం ఉదయం తన నివాసంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రివర్గ సహచరులతో అల్పాహార విందులో భేటీ అయ్యారు. ఈ సమావేశం తర్వాతే ఆయన తన తదుపరి కార్యాచరణను ప్రకటించనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అశోక్ కె. పట్టన్ మీడియాతో మాట్లాడుతూ, "సిద్ధరామయ్య నేడు మధ్యాహ్నం 3 గంటల తర్వాత రాజీనామా చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన గవర్నర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. తదుపరి సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టే అవకాశం 100 శాతం ఉంది" అని బాంబు పేల్చారు.

సీనియర్ నేత ఆర్.వి. దేశ్‌పాండే కూడా ఈ వార్తలను ధృవీకరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "నేను సీఎం సిద్ధరామయ్యతో ఉన్నప్పుడు, 'నేను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను' అని ఆయన స్వయంగా చెప్పారు. ఎందుకు రాజీనామా చేస్తున్నారని నేను అడగలేదు. కొనసాగాలని మేము కోరినప్పటికీ, హైకమాం...