Andhrapradesh, సెప్టెంబర్ 21 -- రాజమహేంద్రవరం - తిరుపతి మధ్య కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 1వ తేదీ 2025 నుంచి ఈ మార్గం లో అలయన్స్ ఎయిర్ ATR - 72 విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని ప్రకటించారు.
ఈ కొత్త సర్వీసు ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడమే కాకుండా, తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అనేకమంది భక్తులకు ఎంతో ఉపయుక్తంగా మారబోతోందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రస్తావిస్తున్న 'కనెక్టెడ్ ఆంధ్రప్రదేశ్' ఆలోచనకు అనుగుణంగా ఈ సర్వీసును ఏర్పాటు చేయటం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అలయన్స్ ఎయిర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.
Published by HT Digital Content Services with permis...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.