Andhrapradesh, సెప్టెంబర్ 21 -- రాజమహేంద్రవరం - తిరుపతి మధ్య కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 1వ తేదీ 2025 నుంచి ఈ మార్గం లో అలయన్స్ ఎయిర్ ATR - 72 విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని ప్రకటించారు.

ఈ కొత్త సర్వీసు ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడమే కాకుండా, తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అనేకమంది భక్తులకు ఎంతో ఉపయుక్తంగా మారబోతోందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రస్తావిస్తున్న 'కనెక్టెడ్ ఆంధ్రప్రదేశ్' ఆలోచనకు అనుగుణంగా ఈ సర్వీసును ఏర్పాటు చేయటం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అలయన్స్ ఎయిర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.

Published by HT Digital Content Services with permis...